పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరికి గురిచేస్తే క్రిమినల్ కేసులు : ఎస్పీ అఖిల్ మహాజన్

by Sumithra |
పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరికి గురిచేస్తే క్రిమినల్ కేసులు : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ముస్కాన్-X కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 0-18 సంవత్సరాలలోపు తప్పిపోయిన, వివిధ రకాల బాలకార్మికులు వారు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ, వదిలివేసిన పిల్లలు రోడ్డు పై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న ఉన్నట్లయితే, అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపిస్తామన్నారు.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేస్తుందన్నారు. జిల్లాలో చిన్న పిల్లలతో పని చేపించే వారి పై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని, ఈ ట్రోల్ ఫ్రీ నంబర్స్ 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు.

Next Story

Most Viewed