- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలు చేయడం పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కూటమి ప్రభుత్వం లో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు. అనంతరం మంత్రివర్గంతో కలిసి అభివృద్ధి మౌలిక సదుపాయాలు, విజయోత్సవ రాలి పై ప్రస్తుతం పవన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతంలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG, OG అంటూ అరవడం మొదలు పెట్టారు. దీంతో పవన్ నవ్వూతూ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అన్నారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షేడ్యూల్ తయారు చేసుకొవాలని చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతున్న OG సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని ఉప్పాడ సభలో తన అభిమానులకు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Read More..