- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్కి’ సినిమాలో కృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇవ్వడంపై.. ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసిన అర్జున్ దాస్
దిశ, సినిమా: ప్రభాస్ కల్కి సినిమాలో శ్రీకృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇచ్చిన తమిళ నటుడు అర్జున్ దాస్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాకుండా స్టార్స్ ప్రశంసలు అందుకుంటూ థియేటర్స్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. అర్జున్ దాస్ సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ షేర్ చేశాడు. ‘‘ కొన్ని వారాల క్రితం స్వప్న నుండి నాకు ఫోన్ వచ్చింది. కల్కిలో శ్రీకృష్ణుని పాత్రకు డబ్బింగ్ చెప్పాలి అని చెప్పింది. అది వినగానే మొదట నేను కొంచెం సంకోచించాను. కానీ ఆమె మీరు అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడే అవకాశం ఉంటుంది మమ్మల్ని నమ్మండి అని రెండు విషయాలు చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి పాఠశాలలో, కళాశాలలో అతని వాయిస్ ట్రై చేశాను కానీ డబ్బింగ్ చేయగలనో లేదో నాకు కచ్చితంగా తెలియదు. అయితే నేను హైదరాబాద్‌కు వెళ్లి స్టూడియోకి చేరుకోగానే అమితాబ్ సార్ డబ్ ప్లే చేయమని ఇంజనీర్‌ను రిక్వెస్ట్ చేశాను. నేను బచ్చన్ సర్ వాయిస్ విన్నప్పటి నుండి అందులోంచి బయటకు రావడానికి కాస్త సమయం పట్టింది.
నాకు వినబడేది అతని ఐకానిక్ డైలాగ్‌లు మాత్రమే. స్కూల్‌లో ఉన్న రోజులన్నీ ప్రేక్షకులకు తన డైలాగ్స్ చెప్పేవాడిని. ఇక్కడ మాత్రం అతని వాయిస్ వినడంతో పాటు అతనితో డైలాగ్స్ పంచుకోవాలి. నేను స్వయంగా సేకరించి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాను. తర్వాత మూడు రోజులలో. నాగ్ అశ్విన్ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నా దగ్గరకు వచ్చి కూర్చుని నాకు మార్గనిర్దేశం చేశారు. కానీ దురదృష్టవశాత్తు సమయాభావం వల్ల నేను తెలుగు, హిందీలో మాత్రమే డబ్ చేయగలిగాను. నాగ్ చాలా ఓపికగా దయతో ఉన్నందున చాలా ధన్యవాదాలు. స్వప్నా మీరు ఊహించిన దానికి నేను కొంచెం దగ్గరగా రాగలిగానని ఆశిస్తున్నాను.
వాయిస్ ఓవర్‌కు సంబంధించిన నాకు సందేశం పంపడానికి సమయాన్ని కేటాయించినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంతకు ముందు చెప్పినట్లుగా నాగ్, స్వప్నకు మాత్రమే దక్కాలి. వైజయంతీ మూవీస్, స్వప్న, నాగ్ అశ్విన్, ప్రభాస్ గారు, అమితాబ్, దీపికా మేడమ్, కమల్ సర్, మీ గొప్ప పనిలో చిన్న భాగం కావడానికి నన్ను అనుమతించినందుకు సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చిన్నప్పుడు బచ్చన్ సర్‌కి డైలాగులు చెప్పాలని కలలో కూడా అనుకోలేదు. కల్కి టీమ్‌కి ధన్యవాదాలు. బచ్చన్ సర్ ‘‘నా డబ్బు భవనాలు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్, మీరు ఎంత డబ్బు సంపాదించారు అని ఎవరైనా అడిగితే నేను గర్వంగా చెబుతాను. బచ్చన్ సార్‌తో కల్కిలో నాగో డైలాగ్ ఉంది అని ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చాడు.