రూ. 7 వేలు పింఛన్ తీసుకున్న వృద్ధుడు.. సంతోషంలో ఏం చేశాడంటే..!

by srinivas |
రూ. 7 వేలు పింఛన్ తీసుకున్న వృద్ధుడు.. సంతోషంలో ఏం చేశాడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి అయింది. 97 శాతం పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయినట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సెక్రటేరియట్ సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి పింఛన్ డబ్బులను వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్విరామంగా పంపిణీ చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలకు రావాల్సిన రూ. 1000తో కలిపి జులై నెలకు సంబంధించిన రూ. 4 వేలను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో రూ. 7 వేలు తీసుకున్న ఓ వృద్ధుడు రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్ వేశారు. పింఛన్ నగదును చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జై బోలో జైబోలో చంద్రబాబుకి జై బోలో, జై చంద్రన్న, ఆహా, ఓహో అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్‌పై ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed