పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మీకోసమే ఈ సమాచారం!

by Jakkula Samataha |
పీరియడ్స్ సమయంలో  ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా.. మీకోసమే ఈ సమాచారం!
X

దిశ, ఫీచర్స్ : ప్రతి మహిళా ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ అనేది కామన్ ప్రాబ్లమ్. ప్రతి నెల ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. అయితే ఈ నెలసరి సమయంలో మహిళలు అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి నెల 28 రోజులకు నెలసరి కావడం అనేది సహజం. అయితే కొంత మందికి నెల రోజులు లేటుగా కావడం లేదా 15 రోజలకే పీరియడ్స్ రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకొంత మందికి అధిక రక్త స్రావం, తేలికపాటి బ్లీడింగ్ కావడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే వీటి వలన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, నెలసరి సమయంలో ఇలాంటి లక్షణాలు గనుక కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పు ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

1.పీరియడ్స్ నొప్పి : కొంత మందికి నెలసరి సమయంలో కడుపు నొప్పి,నడుము నొప్పి రావడం అనేది కామన్. అయితే ఇది ఎప్పుడూ లేకుండా, సడెన్‌గా స్టమక్ పేయిన్ అతిగా రావడం లేదా బ్యాక్ పెయిన్ రావడం గనక జరిగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలంట.

2. అధిక రక్తస్రావం : ఎప్పుడూ లేని విధంగా పీరియడ్స్ సమయంలో అధికంగా బ్లీడింగ్ అయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఒక రోజులో కనీసం నాలుగు ప్యాడ్స్ మార్చుకుంటున్నారు అంటే అది అధిక రక్తస్రావం అని గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే అలసట, నీరసం లాంటి సమస్యలు వస్తాయి.

3. అనుకోకుండా నెలసరి : కొంత మందికి పీరియడ్స్ అయిపోయినా, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుంటుంది. ఇలా సమస్య ఎదురైనా వైద్యుడిని సంప్రదించాలంట.

4. మైగ్రేన్ : పీరియడ్స్ అయిపోయిన తర్వాత, పీరియడ్స్‌కు ముందు అధికంగా మైగ్రేన్ తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించి, సలహా తీసుకోవాలంట.

5. బ్లీడింగ్ కాకపోవడం : కొందరికి మెన్సెస్ వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి రక్తస్రావం అనేది కాదు. అయితే ఇది కూడా సమస్యనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటువంటి పరిస్థితి ఎదురైనా వైద్యుడిని సంప్రదించాలంట.

(నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Next Story