అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ : మంత్రి పొన్నం

by Aamani |
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ  : మంత్రి పొన్నం
X

దిశ, హుస్నాబాద్ : రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏదీ శాశ్వతం కాదని ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి పనులు చేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ సభ్యులకు చివరి సమావేశం అయినందున వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మండల అభివృద్ధి ,జరుగుతున్న పనులపై అధికారాలను ఆరా తీశారు. మండలంలో విద్య ,వైద్యం , వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎరువుల లోటు లేకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

సమావేశానికి ఎంఈవో గైర్హాజరై నందున నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని ఆర్డీవో ను ఆదేశించారు.తమ ప్రభుత్వం రాగానే 26 వేల స్కూల్ లకు 11 వందల కోట్లతో మౌళిక సదుపాయాల కల్పన చేశామని పాఠశాల కి టాయిలెట్స్ , వంట గదులు ,రంగులు తదితర సౌకర్యాలు కల్పించామని తెలిపారు . మండలంలోని వివిధ స్కూల్ లకి ఇంకా కలర్స్ వేయడం పూర్తి కాలేదని పలువురు ఎంపిటిసి లు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో ఎంఈవో ను వివరణ కోరారు. నియోజకవర్గంలోని నాలుగు గురుకులాలు ఉండే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ను కోహెడ మండలంలోని తంగలపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కోహెడ లో వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.వేసవి కాలంలో డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఎస్ డి ఎఫ్ నిధులతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని వాటి పురోగతి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.

మండలంలోని గ్రామాల్లో తాగు నీటికి సంబంధించిన ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామాల్లో మంజూరైన రోడ్లు ఎన్ని పనులు నడుస్తున్న రోడ్లు వివిధ గ్రామాలకు మండల కేంద్రానికి కనెక్టివిటీ రోడ్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్,విద్యుత్ కు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మండలంలో 500 కి గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ రానివారి పై ఆరా తీశారు.తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని తెలిపారు.సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ,జడ్పీటీసీ నాగుల శ్యామల మధుసూదన్ రావు ,వైస్ ఎంపిపి తడ్కల రాజిరెడ్డి, ఆర్డీవో శ్రీరామ్ మూర్తి , ఎంపిడిఓ కృష్ణయ్య ,వివిధ గ్రామాల ఎంపీటీసీలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story