ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!

by Javid Pasha |   ( Updated:2024-06-29 10:40:45.0  )
ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!
X

దిశ, ఫీచర్స్ : ఎక్కువగా బయట తిరగడం, దుమ్మూ ధూళి వంటి పొల్యూషన్‌కు గురికావడం, అపరిశుభ్రత వంటివి చర్మంపై ప్రభావం చూపుతుంటాయి. శుభ్రత పాటించినప్పటికీ కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా ముఖంపై గల చర్మం రంధ్రాల్లోకి కలుషిత ధూళి చొచ్చుకుపోవడం, మురికి పేరుకుపోవడం కారణంగా బ్లాక్ హెడ్స్ ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు సాధారణంకంటే కాస్త అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వాటిని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. అయితే పెద్దగా ఖర్చులేకుండా ఇంట్లోనే పాటించగల హోమ్ రెమిడీస్ ద్వారా కూడా నల్లమచ్చలను నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

చక్కెరతో స్క్రబ్బింగ్

ముఖంపై నల్లటి మచ్చల నివారణలో చక్కెర కూడా అద్భుతంగా పనిచేస్తుందట. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. షుగర్‌తో నల్లటి మచ్చలు గల భాగంలో స్క్రబ్ చేసుకోవడమే. అయితే కేవలం చక్కెరతో కాదు, అంతకుముందు ఓ నిమ్మకాయను కట్ చేయండి. దానిపై కొద్దిగా చక్కెరను చల్లి ఆ తర్వాత బ్లాక్ హెడ్స్ ఉన్నచోట స్క్రబ్ చేస్తే నల్లటి మచ్చలు పోతాయి.

ఉప్పు, నిమ్మరసం మిక్స్‌తో..

ఉప్పులో ఉండే బ్లీచింగ్ ఎఫెక్ట్ నల్ల మచ్చలను పోగొట్టడంలో సహాయపడుతుంది. ముందుగా నిమ్మరసం తీసుకొని అందులో ఉప్పు మిక్స్ చేయండి. ఆ తర్వాత నల్లటి మచ్చలు ఉన్న భాగంలో లేదా ముఖంపై మొత్తంగా అప్లయ్ చేయండి. ఓ పదినిమిషాల తర్వాత ముఖం కడగండి. ఇలా అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే ముఖంపై మచ్చలు పోతాయి. అలాగే రాకుండా కూడా ఉంటాయి.

బొప్పాయి, అరటి

బొప్పాయి, అరటి పండ్లు కూడా నల్ల మచ్చల నివారణలో హెల్ప్ అవుతాయి. ఇందుకోసం ముందుగా బొప్పాయి, పాలపొడి, నిమ్మరసం, బియ్యపు పిండి ఈ మూడు తీసుకొని, పేస్ట్‌లా మిక్స్ చేయండి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి, స్మూత్‌గా స్క్రబ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే చాలు. నల్ల మచ్చలు పరార్. ఇక అరటి పండు విషయానికి వస్తే దాని గుజ్జు, రెండు చెంచాల ఓట్ మీల్ పొడి, ఒక స్పూన్ తేనె తీసుకొని వాటిని మిక్స్ చేయండి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు. నల్లమచ్చలు పోతాయి.

కొబ్బరి నూనె, దాల్చిన చెక్క

బ్లాక్ హెడ్స్ నివారణలో కొబ్బరి నూనె, దాల్చిన చెక్క కూడా అద్భుతంగా పనిచేస్తాయ్. మచ్చలను పోగొట్టడానికి ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో, మరో టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ లా చేసుకోండి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. దీంతోపాటు మరో చిట్కా ఏంటంటే. ఒక చెంచా నిమ్మరసంలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను, చిటికెడు తేనెను వేసి కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై అప్లై్ చేసి 10 లేదా 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరి. మచ్చలు మాయం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసానాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed