డ్రగ్స్ సేవిస్తూ గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్

by Sridhar Babu |
డ్రగ్స్ సేవిస్తూ గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : డ్రగ్స్ సేవిస్తూ గంజాయి తరలిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ పై పూర్తిగా దృష్టి సారించామని, డ్రగ్స్ సేవించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య, మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. శుక్రవారం రాత్రి విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నలుగురు డ్రగ్స్ కన్జ్యూమర్లను పట్టుకున్నట్లు డీసీపీ వినీత్ వెల్లడించారు. అందులో సచిన్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ కాగా మిగతా ముగ్గురు నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ కన్జ్యూమర్లని తెలిపారు. వీరి వద్ద నుండి ఒకటిన్నర కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. వీరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని తెలిపారు.

దూద్ బోలిలో నివసించే సచిన్ డ్రగ్ సరఫరాదారుడిగా వ్యవహరిస్తున్నారని, ఇతను మిగతా ముగ్గురికి గంజాయి సప్లై చేస్తాడన్నారు. రాజా అని యువకుడితో పాటు డ్రగ్ సరఫరాదారు పరారీలో ఉన్నాడని, వారిని త్వరలో అతన్ని పట్టుకుంటామన్నారు. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. నవీన్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఉందని, ఎన్ బీ డబ్ల్యూ పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. అలాగే కేరళ రాష్ట్రం పాలక్కాడ్ పోలీసు స్టేషన్ లో కూడా కేసు ఉందని, ఆ కేసులో కన్విక్షన్ కూడా వచ్చిందన్నారు. నవీన్ బ్రిలియంట్ స్టూడెంట్ అని 2015లో ఎన్ఐటీ అడ్మిషన్ తీసుకున్న అతనికి ఆల్ ఇండియా 800 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఎన్ఐటీలో చెడు సావాసాలకు అలవాటు పడ్డ అతను, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడని వెల్లడించారు. 2018 తర్వాత చదువు మధ్యలో ఆపేశాడని, డ్రగ్స్ అలవాటు పడ్డ విషయం

తెలుసుకున్నాక తల్లిదండ్రులు అతన్ని మార్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. అతనిలో మార్పు రాక చదువు మధ్యలో మానేసి బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సప్లయర్ తో మాట్లాడుకుని డ్రగ్స్ ఫెడ్లర్ గా మారినట్లు పోలీసులు గుర్తించామని, నవీన్ 2022లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి డ్రగ్ సప్లై చేస్తుండగా దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అప్పుడు తప్పించుకున్నాడని, తాజాగా హైదరాబాద్​లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడని, పక్కా సమాచారం అందడంతో అతడిని పట్టుకున్నామన్నారు. వీరు ఎండీఎంఏ

డ్రగ్ ను బెంగళూరులో ప్రజ్వల్ తో పాటు మరో వ్యక్తి దగ్గర కొనేవాళ్లని, అక్కడి నుండి తీసుకువచ్చి అమ్మేవారన్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని, డ్రగ్స్ పై ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు. డ్రగ్స్ సేవించిన వారికి వెంటనే మూత్ర పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటామని, నీతూబాయ్ అనే గంజాయి విక్రయదారు ఆస్తులను అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ కూడా పెట్టామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. గంజాయి సప్లయర్లు ఉంటే ఆ వృత్తి మానేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed