ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం..అభివృద్ధి చేసిన భారత్

by vinod kumar |
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం..అభివృద్ధి చేసిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొత్త పేలుడు పదార్థాన్ని భారత్ విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీనికి SEBEX-2గా నామకరణం చేశారు. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మేక్ ఇన్ ఇండియా కింద దీనిని అభివృద్ధి చేశారు. ఈ పేలుడు పదార్థాన్ని భారత నౌకాదళానికి చెందిన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ కింద పరీక్షించారు. ఇది ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్‌టీ) కంటే రెండు రెట్లు ప్రమాదకరం. సెబెక్స్2 భారత పేలుడు సామర్థ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మోస్ క్షిపణి వార్‌హెడ్‌లో దీనిని అమర్చబోతున్నట్టు తెలుస్తోంది.

Next Story