BREAKING: జార్ఖండ్ సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా

by Satheesh |
BREAKING: జార్ఖండ్ సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. కాగా, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ భూ కుంభ కోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రిజైన్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేఎంఎంలో కీలక నేతగా ఉన్న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, భూ కుంభకోణం కేసులో బెయిల్ రావడంతో ఇటీవల హేమంత్ సోరెన్ బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్ కోరారు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన చంపై సోరెన్‌కు జేఎంఎం పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed