దుండిగల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత..

by Sumithra |
దుండిగల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
X

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీలోని టెక్ మహీంద్రా ఎదురుగా 200 గజాల స్థలంలో ఓ నిర్మాణదారుడు 100 ఫీట్ల రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు కమిషనర్ కె.సత్యనారాయణ రావు ఆదేశాలతో టీపీఓ సంజున అక్రమనిర్మాణాలను జేసీబీతో బుధవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్రమనిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story