యూఎస్ స్టేట్ సెనేట్‌కు పోటీ చేస్తున్న ఇండియన్-అమెరికన్ అభ్యర్థికి సెనేటర్ మద్దతు

by S Gopi |
యూఎస్ స్టేట్ సెనేట్‌కు పోటీ చేస్తున్న ఇండియన్-అమెరికన్ అభ్యర్థికి సెనేటర్ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ స్టేట్ సెనేట్‌కు పోటీ చేసిన మొదటి జెన్-జెడ్ ఇండియన్-అమెరికన్ అభ్యర్థి అశ్విన్ రామస్వామిని జార్జియా రాష్ట్ర సెనేట్ స్థానానికి యూఎస్ సెనేటర్ జోన్ ఓసోఫ్ మద్దతిచ్చారు. 24 ఏళ్ల రామస్వామి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ 48లో డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జార్జియాలో 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్టు అభియోగాలు ఉన్న రిపబ్లికన్‌కు చెందిన ప్రస్తుత స్టేట్ సెనేటర్ షాన్ స్టిల్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన తొలి ప్రచారానికి తాజా ఆమోదం కీలక పరిణామంగా మారనుంది. ఒకవేళ అశ్విన్ రామస్వామి గెలిస్తే జార్జియా చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రతినిధిగా నిలవనున్నారు. తనకు మద్దతివ్వడంపై రామస్వామి ధన్యవాదాలు తెలిపారు. జార్జియా మౌలిక సదుపాయాల పురోగతి సాధించడం దగ్గరినుంచి క్లైమెట్ ఛేంజ్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడం వరకు సెనేటర్ ఒసాఫ్ జార్జియాకు ఛాంపియన్‌గా నిలిచారని అన్నారు. ఒసాఫ్ నుంచి తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞత చెబుతున్నాను. హెల్త్‌కేర్ విస్తరణ సహా ఇతర అంశాల్లో ఆయంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Next Story