IAS ఆమ్రపాలి దూకుడు.. GHMC పరిధిలో సాధారణ పౌరురాలిలా ఆకస్మిక తనిఖీలు

by Satheesh |
IAS ఆమ్రపాలి దూకుడు.. GHMC పరిధిలో సాధారణ పౌరురాలిలా ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలీలో దూకుడు పెంచారు. ఇటీవల నగర కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి.. బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణ పౌరురాలిలా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, డైనమిక్ ఆఫీసర్‌గా పేరుగాంచిన ఆమ్రపాలి మొన్నటి వరకు కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె డిప్యూటేషన్‌పై మళ్లీ తెలంగాణకు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలికి సరైన ప్రాధాన్యత దక్కింది. మొదట ఆమెను హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమించగా.. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి నగర కమిషనర్‌గా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.

Next Story

Most Viewed