ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. జబర్దస్త్ రోహిణి సంచలన కామెంట్స్!

by Kavitha |
ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. జబర్దస్త్ రోహిణి సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: ‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రోహిణి కూడా ఒకరు. ఇక ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్‌లో స్మైల్ వస్తుంది. ఎందుకంటే తన నటనతో , కామెడీ టైమిగ్స్‌తో అంతలా ఆకట్టుకుంది రోహిణి. ఈమె కెరీర్ స్టార్టింగ్‌లో సీరీయల్స్ నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత పాపులారిటీ అయితే రాలేదు. తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ రియాలీటీ షోలోకి వెళ్లే అవకాశాన్ని సంపాదించుకున్నది. దీంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇలా ఓ పక్కా పలు షోలు, మరో పక్కా వెబ్ సీరీస్‌లు చేస్తు బిజీ బిజీగా ఉంటుంది. అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. చాలా స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది రోహిణి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిణి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవకాశాల కోసం చాలా మంది దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా మాట్లాడారని ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగే వారిని.. తనలో ఉన్న టాలెంట్‌ని గుర్తించక ఇలాంటివన్నీ అడగడంతో చాలా బాధపడేదాన్ని అంటూ రోహిణి తెలియజేసింది. అంతేకాకుండా తన తండ్రి లాంటి వ్యక్తి కదా అంటూ ఒక అడిషన్‌కి వెళ్ళగా నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని దీంతో అక్కడికక్కడే ఒక సినిమాని రిజెక్ట్ చేశానని తెలియజేసింది.

ఇలా తన కెరియర్‌లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని కానీ ఎలాంటి తప్పుడు మార్గం వైపుగా తాను వెళ్ళలేదని తన టాలెంట్‌ని నమ్ముకుని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని.. ఈ జీవితం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని.. ప్రెసెంట్ తాను జీవితంలో పెద్దగా గోల్స్ అంటూ ఏమి పెట్టుకోలేదంటూ చెప్పుకొచ్చింది రోహిణి.. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed