బంగ్లాతో తొలి టీ20కి ‘బంద్’ ఎఫెక్ట్.. 1,600 పోలీసులతో భారీ భద్రత!

by saikumar |
బంగ్లాతో తొలి టీ20కి ‘బంద్’ ఎఫెక్ట్.. 1,600 పోలీసులతో భారీ భద్రత!
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు సిరీస్‌ల టోర్నీని నెగ్గిన భారత్.. తాజాగా టీ20 సిరీస్ కన్నేసింది. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. తొలి మ్యాచ్ ఈనెల 6వ తేదీన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ స్టేడియంలో జరగనుంది. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టును సూర్యకుమార్ యాద‌వ్ ముందుండి నడిపించనున్నాడు. ఇప్పటికే గ్వాలియ‌ర్ చేరుకున్న భార‌త్, బంగ్లా క్రికెట‌ర్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు.

ఈక్రమంలోనే ఆ రోజున ‘గ్వాలియ‌ర్ బంద్‌’కు హిందూ మ‌హాస‌భ పిలుపునిచ్చింది. బంగ్లాతో టీ20 సిరీస్ ర‌ద్దు చేయాల‌ని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. దీంతో గ్వాలియ‌ర్ జిల్లా క‌లెక్టర్, పోలీస్ క‌మిష‌న‌ర్ స్టేడియం ప‌రిస‌రాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌లో వంద‌లాది హిందువులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకే బంగ్లాతో టీ20 సిరీస్ రద్దు చేయాలని హిందూ మహాసభ సంఘం స‌భ్యులు పెద్ద ఎత్తున ఆందోళ‌నకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే స్టేడియం పరిసరాల్లో 163 సెక్షన్ విధించారు. అక్కడ ర్యాలీలు తీయ‌డం, 200 మీట‌ర్ల దూరంలో మార‌ణాయుధాలతో ఎవరు కనిపించినా అరెస్ట్ చేస్తామ‌ని పోలీసులు హెచ్చరించారు. సుమారు 1,600 మంది పోలీసులతో బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.

Advertisement

Next Story