జూనియర్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌ నెం.1 స్థానంలో భారత్!

by saikumar |
జూనియర్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌ నెం.1 స్థానంలో భారత్!
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పెరూ దేశంలోని లిమా వేదికగా కొనసాగుతున్న జూనియర్ వరల్డ్ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పురుషుల విభాగంలో టీమిండియా త్రయం గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ముకేశ్ నేలవల్లి, రాజ్‌వర్థన్‌, హర్సీమర్‌ సింగ్‌ రత్తా 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటివరకు టీమిండియా 16 పతకాలు సాధించగా.. 11 బంగారు, 1 రజత, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. దీనికి ముందు భారత క్రీడాకారిణి ఖుషి కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌లో ఖుషి (447.3) మూడో స్థానంలో నిలిచింది. 8 మంది బరిలో దిగిన ఫైనల్లో సినోవీ బర్గ్‌ (458.4 - నార్వే) స్వర్ణం, కరోలిన్‌ లుండ్‌ (458.3 - నార్వే) రజతం గెలుచుకున్నారు. ఇక అర్హత రౌండ్లో ఖుషి ఏడో స్థానంలో నిలిచింది. నలుగురు క్రీడాకారిణుల పాయింట్లు సమం అవ్వగా.. కౌంట్‌బ్యాక్‌లో ఖుషి ఏడు, అనా షివాన్‌ (ఇటలీ) ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.

Advertisement

Next Story