- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ టిప్స్ ఫాలో అయితే.. మీ ప్రేమ మీ సొంతం అయినట్లే..
దిశ, ఫీచర్స్ : ప్రేమను అనుభవిస్తేనే తెలుస్తుంది ఎంత మధురంగా ఉంటుందో అంటుంటారు. కానీ ఇద్దరు ఆ అనుభూతి పొందితేనే లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లి పీటల వరకు వెళ్తుంది. అయితే ప్రేమలో చిన్న చిన్న తప్పులు ఆ క్షణం దక్కకుండా చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ టిప్స్ పాటిస్తే మీ ప్రేమ కచ్చితంగా విజయం సాధిస్తుందని భరోసా ఇస్తున్నారు.
అనారోగ్య పోలికలు
మన జీవితాలను ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదం. ఎవరి లైఫ్ కూడా సోషల్ మీడియాలో చూపించిన ఫొటో మాదిరిగా పర్ఫెక్ట్ గా ఉండదు. పైకి గొప్పగా కనిపించిన వారి విషయంలోనూ కొన్ని లూప్ హోల్స్ ఉండవచ్చు. అంటే ఎవరు సంపూర్ణంగా ఉండలేరని గుర్తించి.. ఒకరితో కంపేర్ చేసుకోకుండా..మన లైఫ్ మనం చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేస్తే అసలుకే మోసం రావచ్చని హెచ్చరిస్తున్నారు. భాగస్వామితో పంచుకునే ప్రత్యేక బంధాన్ని కోల్పోయి.. అసంతృప్తి మాత్రమే మిగులుతుందని వార్న్ చేస్తున్నారు.
గతాన్ని పట్టుకు వేలాడితే
ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైనది. కానీ కొన్ని సందర్భాల్లో కొందరితో బంధం మనను కోలుకోలేని దెబ్బతీయవచ్చు. ఆ తర్వాత మంచి పర్సన్ తో లవ్ లో పడొచ్చు. అలాంటప్పుడు ఆ సమయాన్ని, ఆ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేయాలి. కానీ అనవసరంగా గతాన్ని తలుచుకుంటూ.. ప్రస్తుత బంధాన్ని అనుభూతి చెందడం మానేయకూడదు. అది అసలుకే ముప్పు తీసుకురావచ్చు. మీ ఇన్వాల్వ్మెంట్, ఇష్టం కనిపించని భాగస్వామి.. మీతో విసిపోవాలనుకునే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అందమైన జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా కాకుండా గతాన్ని పక్కన పెట్టేస్తే.. లవ్ జర్నీ చేయడం మరింత సులభం అవుతుంది.
కోడిపెండెన్సీ
అంటే ఒక వ్యక్తి ఆనందం పూర్తిగా ఎదుటివారి చర్యలపై ఆధారపడి ఉంటాయి. ఇది వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకుంటుంది. అనారోగ్య డైనమిక్‌లను ప్రోత్సహిస్తుంది. కాబట్టి చాలా హానికరం. కాగా సొంత అవసరాలు, కోరికలు కోల్పోతారు. ప్రతి విషయంలో భాగస్వామిని పరిగణనలోకి తీసుకొనే ముందుకు సాగుతారు. ఇదే పద్ధతి ఎక్కువ కాలం కొనసాగితే మీకు విసుగు రావచ్చు. బంధానికి బై బై చెప్పాలని అనిపించవచ్చు. మొత్తానికి లవ్ కాస్త భరించలేనిదిగా మారి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఓవర్ రొమాంటిక్ లవ్
ప్రేమను అతిగా రొమాంటిసైజ్ చేయడం ప్రమాదమే. ఇలాంటి హాలివుడ్ వెర్షన్ లవ్ లో చిక్కుకున్నప్పుడు.. నిజ జీవిత సంబంధానికి చెందిన అవకాశాలను కోల్పోతాం. నిజమైన ప్రేమ అనేది రాజీ, అవగాహన, సహనం కలిసి ఉన్న జీవితాన్ని జీవించడం. అంతేకాని ఇలాంటి రొమాన్స్ కోరుకోవడం కాదు. రియల్ లవ్ ఎప్పుడు కలిసి జీవించాలని కోరుకుంటుంది కానీ ఆ విధంగా లవ్ కోరుకోకపోవచ్చు.
కష్టమైన సంభాషణ
భావాలు, సరిహద్దులు, నిరుత్సాహాలకు సంబంధించిన ముచ్చట్లు భాగస్వామిని కష్టపెట్టవచ్చు. అసౌకర్యంగా, భయానకంగా అనిపించవచ్చు.ఆరోగ్యకరమైన, విజయవంతమైన బంధం కావాలని అనుకున్నప్పుడు ఈ చర్చను అవాయిడ్ చేయండి. నిజానికి ఇలాంటి మాటలు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి.. తరుచుగా మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి .
స్వీయ సంరక్షణ నిర్లక్ష్యం
స్వీయ-సంరక్షణ ప్రయోజనాలు మరింత సహనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంతోషకరమైన సంబంధాలను కలిగి ఉంటాయి. దానిని నిర్లక్ష్యం చేయడం వలన అసంపూర్తిగా లేదా విషపూరితమైన సంబంధాలలోకి మనల్ని మనం నెట్టుకున్నట్లు అవుతుంది. అందుకే భాగస్వామిపై మీ ప్రేమతోపాటు మీకు మీరు లవ్ చూపించుకుంటే.. కచ్చితంగా పెళ్లి సాధ్యమే అంటున్నారు నిపుణులు.