రైతు భరోసా సమావేశంలో రైతులు డుమ్మా

by Aamani |
రైతు భరోసా సమావేశంలో రైతులు డుమ్మా
X

దిశ,మల్హర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు పథకాలపై చర్చించేందుకు రైతు భరోసా పథకం లో భాగంగా బుధవారం కొయ్యూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు డుమ్మా కొట్టారు. తాడిచర్ల పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఉన్నట్లు ఒకే రోజు సమాచారం ఇచ్చి సమావేశం నిర్వహించడం పట్ల నిర్లక్ష్యానికి గురైన రైతు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించిన రైతు భరోసా సమావేశంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అడపాదడపా హాజరైన రైతులతో అంతంత మాత్రంగానే సమావేశం నిర్వహించి అధికారులు వెళ్లిపోయారు. దీంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంతో రైతులకు ప్రవేశపెట్టే పథకాలపై సమీక్షించాల్సిన అధికారులు ఒక్కరోజు సమాచారం ఇచ్చి మర్నాడు సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలులో డీసీఎంఎస్, పీఎస్సీఎస్ ధాన్యం కేంద్రాల నిర్వహకులు భారీగా కోత విధించి ఒక్కొక్క రైతుకు వేల రూపాయలు నష్టం జరిగేలా చేసిన అవినీతిపై ప్రశ్నిస్తారనే కోణంతో అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొని పోయినట్లు రైతులు ఆరోపించారు. అర కోరగా హాజరైన రైతులు 10 ఎకరాల వరకు రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకోవాలని సన్న చిన్న రైతులకు మేలు జరగనుందని రైతులు కోరగా వారి సూచనలు సలహాల నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతోంది అని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల పల్లి మలహార్ రావు ,జడ్పీటీసీ అయిత కోమల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, ఎంపీటీసీ అవిరినేని ప్రకాశ్ రావు గారు, డైరెక్టర్స్ వొన్న తిరుపతి రావు, బానోత్ సమ్మక్క కిషన్,సంగెం రమేష్,మండల వ్యవసాయాధికారి సుధాకర్, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ రెడ్డి, సంఘ సభ్యులు ,రైతులు, ఏఈఓలు, పీఎసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed