BREAKING: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య

by Shiva |   ( Updated:2024-07-06 02:25:33.0  )
BREAKING: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో సంచలన ఘటన చోటుచేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్‌స్ట్రాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరు అనుచరులు కూడా గాయపడ్డారు. చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆయన నివాసం ఉంటుండగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చిన ఆరుగురు దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. దాడికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్టు అయినట్లుగా పోలీసులు తెలిపారు. హత్య వెనుక ప్రత్యర్థుల అసలు ఉద్దేశ్యం ఏమిటో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను గాలించేందుకు 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed