గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు.. 11 మందిపై కేసు నమోదు

by Aamani |
గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు.. 11 మందిపై కేసు నమోదు
X

దిశ,తొర్రూరు : గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించి 11 మందిపై కేసు నమోదు చేసి 6 మందిపై బ్రీచ్ కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ ఎస్సై తిరుపతి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ పరిధిలోని వివిధ గ్రామాలలో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురు పై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఏఈఎస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ తెలిపారు.

బుధవారం తొర్రూర్ ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై తిరుపతి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ స్టేషన్,స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలోని నాటుసారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. సిబ్బందితో కలసి తొర్రూరు పరిధిలోని రతి రాం తండా,ఆలేరు,రామోజీ తండాలలో జరిపిన దాడుల్లో నాటు సారాయిని పట్టుకున్నామన్నారు.

ఈ దాడులలో తయారు చేస్తున్న (11) వ్యక్తులను అదుపులోకి తీసుకుని,వారిపై కేసు నమోదు చేసి వారి నుంచి 38 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, నాటు సారా తయారీకి ఉపయోగించే (1700) లీటర్ల బెల్లం/పంచదార పానకాన్ని సంఘటన స్థలంలో ఈ ధ్వంసం చేయడం జరిగిందని, అదేవిధంగా 18 కిలోల బెల్లం,70 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఆరుగురు వ్యక్తులపై బ్రిడ్జ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆరుగురు వ్యక్తులు ఒక లక్ష రూపాయలు జరిమానా లేదా సంవత్సరం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆప్కారి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story