ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి

by Sridhar Babu |
ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లాలో చేపట్టిన ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్లు, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ ఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాఫల్ మండిలో 30 పడగల అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కామాటి పురలో 100 పడకల ఆస్పత్రి, చార్మినార్ ప్రభుత్వ నిజామీయ టిబ్బి కాలేజ్, నిజామియా జనరల్ హాస్పిటల్ లో పునర్నిర్మాణ పనులు, కొత్త బ్లాక్ ల నిర్మాణం, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్, టాయిలెట్స్ బ్లాక్స్, యాకూత్ పుర ఎస్ ఆర్ టీ కాలనీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్,

బండ్లగూడ ఏరియా ఆసుపత్రిలో 50 పడగల ఆస్పత్రి, డబీర్ పుర ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఏర్పాటు , బార్కాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్ గ్రేడేషన్ పనులు, లాలాపేట్ 30 పడకల అర్బన్ హెల్త్ కేర్ సెంటర్, అడ్డగుట్ట 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు,నల్లకుంట ఓపీడీ బ్లాక్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ బిల్డింగ్,ఎర్రమాంజిల్ ఎంసీహెచ్ లో 200 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ కోఠి హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టెండర్ లు పిలవని చోట వెంటనే టెండర్లను పిలవాలని, నిర్మాణం మొదలైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీ ఎంఎస్ఐడీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి, ఈఈ చలపతిరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి , డీసీహెచ్ఎస్ డాక్టర్ సునీత, టీజీ ఎమ్ఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.నాయుడు, డీఈ పి.జగదీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed