ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి వల్లూరు

by Aamani |
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి  : కలెక్టర్  క్రాంతి వల్లూరు
X

దిశ,సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 68 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ కి సంబంధించినవి 46, డీఆర్ డీఓ 11, ఇతర శాఖలకు సంబంధించినవి 11 ప్రజావాణి దరఖాస్తులు అందాయన్నారు.గ్రామాల్లో కరెంటు స్తంభాలు నేలకూ వంగి వేలాడుతున్నాయని, అనుభవం కలిగిన హెల్పర్స్ ను ఏర్పాటు చేయాలని, సింగూరు జలాలు వ్యవసాయ సాగుకు ప్రతి ఏడు జూన్ 15 వరకు నీటిని విడుదల చేసే వారని , సింగూరు ప్రాజెక్టు పరిధిలో రెండు పంటలకు సరిపడగా నీరు విడుదల చేసే విధంగా నీటిపారుదల శాఖకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ అమలు చేయాలని, రైతు భరోసా పథకం కింద సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయాలని భారతీయ కిసాన్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.నరసింహారెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజా రాణి, డీపీఓ సాయిబాబా, డీఆర్ డీఓ జ్యోతి , సంగారెడ్డి ఆర్డీవో వసంత కుమారి , సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story