వారికి రూ. కోటి చొప్పున ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ రిక్వెస్ట్

by srinivas |
వారికి రూ. కోటి చొప్పున ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడిప్పుడే సమస్యలపై స్పందించారు. లడక్‌లో మృతి చెందిన ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ట్వీట్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణలో భాగంగా జవాన్లు అమరులయ్యారని, వారి సేవలు చిరస్మరణీయమని చెప్పారు. జవాన్ల కుటుంబాలకు వైసీపీ నాయకులు సైతం బాసటగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

‘‘లడక్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన సుభాన్‌ ఖాన్ ఉండటం మరింత బాధాకరం. చనిపోయిన జవాన్లకి నా నివాళులు. అలానే వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జగన్ ట్వీట్ చేశారు.

Next Story