Divvela Madhuri: సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీస్ స్టేషన్ లో దివ్వెల మాధురి

by Rani Yarlagadda |
Divvela Madhuri: సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీస్ స్టేషన్ లో దివ్వెల మాధురి
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Srinivas) పై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది దివ్వెల మాధురి (Divvela Madhuri). ఈ మేరకు టెక్కలి సీఐకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా.. సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), హోంమంత్రి అనిత (Home Minister Anitha).. మహిళలపట్ల అసభ్యకరంగా పోస్టులు పెడితే.. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారని, ప్రభుత్వంపై నమ్మకంతోనే కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది.

ముఖ్యంగా జనసేన (janasena) నేతలు తనపై చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది. ఆ పోస్టుల్ని చూసి తాను మానసికంగా చాలా వేదన అనుభవించానని, అంత జుగుప్సాకరంగా జనసేన పేరు చెప్పుకుంటూ పోస్టులు చేస్తున్నారని ఆరోపించింది. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని వాపోయింది దివ్వెల మాధురి. రెండేళ్లక్రితం దువ్వాడ శ్రీనివాస్ పవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టారని, ఇది ఎంతవరకూ కరెక్టో పోలీసులే తేల్చాలన్నారు. దానిపై కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని, ఇందుకు సంబంధించిన అన్ని రుజువులను స్టేషన్లో ఇచ్చామని తెలిపింది. ప్రభుత్వం తమ నిజాయితీని ఎంత మేర ప్రూవ్ చేసుకుంటుందో చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed