ఈ ఉద్యోగాలు చేస్తున్నవారు జాగ్రత్త.. పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకునే అవకాశమే ఎక్కవట!

by Javid Pasha |
ఈ ఉద్యోగాలు చేస్తున్నవారు జాగ్రత్త.. పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకునే అవకాశమే ఎక్కవట!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు కానీ.. ప్రస్తుతం వివిధ కారణాలతో మూణ్నాల్ల ముచ్చటగా ముగుస్తున్నవి చాలానే ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివాహాల్లో దాదాపు సగం వరకు డివోర్స్‌తోనే ముగుస్తున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మరో విషయం ఏంటంటే.. ఒక పర్టిక్యులర్ కెరీర్‌ను లేదా ప్రొఫెషన్‌ను కలిగి ఉంటున్నవారిలోనే ఈ విడాకుల రేటు ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. అదనపు పనిగంటలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం, తక్కువ వేతనం, పెరిగిన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో కొన్ని రకాల వృత్తులు లేదా ఉద్యోగాలు చేసేవారు చివరికి విడాకులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటోంది. వృత్తులేమిటో చూద్దాం.

బార్ టెండర్స్

బార్ టెండర్స్ వృత్తి నిజానికి స్ట్రెస్‌తో కూడుకున్నది. మన దేశంలో తక్కువ కానీ విదేశాల్లో ఈ కల్చర్ ఎక్కువ. ఎందుకంటే వృత్తి రీత్యా బార్లలో గడపాల్సి ఉంటుంది. మద్యపానం చేసే వ్యక్తులు తరచుగా వీరితో రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు. నచ్చినట్లు సరసాలాడుతుంటారు. అలాగే చాలామంది బార్ టెండర్లు ఉద్యోగంలో ఉన్నప్పుడు తాగుతూ ఉంటారు. క్రమంగా వ్యసనాలకు బానిస అయ్యేవారు చాలామందే ఉంటారు. మొత్తానికి ఈ ప్రొఫెషన్ వారి పర్సనల్ లైఫ్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. దీంతో వైవాహిక బంధాలు నిలిచే అవకాశాలు తగ్గుతున్నాయి. విడాకులు తీసుకుంటున్న వారిలో వీరు ముందుంటున్నారు.

కార్పెంటర్స్

కార్పెంటర్స్ సాధారణంగా రాత్రిళ్లు, సాయంత్రం వేళల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. పైగా అధిక సమయం వర్క్ చేయాల్సి రావడం, వారాంతాలు వంటివి లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం, ఇంటికి ఆలస్యంగా రావడం, శారీరక అలసటతో ఇతర పనులకు శరీరం సహకరించకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది వారి రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది. కార్పెంటర్ వృత్తిలో ఉన్నవారు కూడా ఎక్కువగా విడాకుల వైపు మొగ్గు చూపుతున్నవారి జాబితాలో ఉన్నారు.

మిలిటరీ సూపర్ వైజర్స్

మిలిటరీ సూపర్ వైజర్స్ వృత్తిరీత్యా ఎప్పుడూ ఒక విధమైన ఒత్తిడిలో ఉంటారు. పైగా వీరికి సెలవులు ఉండవు. ఉన్నా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కొన్నిరోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేసే అవకాశం చాలా తక్కువ. వృత్తి రీత్యా ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండాలి. వీలైనప్పుడల్లా తమ పార్ట్‌నర్స్‌తో గడిపే అవకాశం లేకపోవడంవల్ల ఆ పరిస్థితి విడాకులకు దారితీస్తుంది.

మెడికల్ అసిస్టెంట్స్

ఈ ప్రొఫెషన్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒత్తిడితో కూడిన పనివాతావరణం, ప్రజల ఆరోగ్య సంరక్షణ అనేది వీరి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులకు కారణం అవుతుంది. అలాగే పని వేళలు, వీకెండ్స్‌లో కూడా అదనపు పని, సెలువులు తక్కువగా ఉండటం, ఓవర్ టైమ్ వర్క్ చేయాల్సి రావడం వంటివి వీరిలో విడాకులకు దారితీస్తాయి.

ఫ్లైట్ అటెండెంట్స్

ఫ్లైట్ అటెండెంట్స్ వృత్తిరీత్యతా ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు ట్రావెలింగ్ ట్రెస్ వారిని కృంగదీస్తుంది. ఇది దాదాపు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్‌కు దారితీస్తుంది. పర్సనల్ లైఫ్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ఈ పరిస్థితి విడాకులకు దారితీస్తుంది.

మసాజ్ థెరపిస్టులు

మసాజ్ థెరపిస్టులు నిజానికి చాలా కష్టపడతారు. ఇతరులకు సేవ చేయడంలో తాము అలసిపోతుంటారు. ఫుల్ డిమాండెడ్ జాబ్ కూడాను కాబట్టి ఎక్కువగంటలు పనిచేయాల్సి వస్తుంది. ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి ఓపిక ఉండదు. తీవ్రమైన అలసట వేధిస్తుంది. క్రమంగా ఇది మారిటల్ ఫెటీగ్‌కు దారితీస్తుంది. ఈ వృత్తిలో ఉన్నవారు పెళ్లి చేసుకున్నా కొన్నాళ్లకు భాగస్వామి విడాకులు కోరే చాన్సెస్ ఎక్కువ.

ట్యాక్స్ ఎగ్జామినర్స్, బిల్ కలెక్టర్స్

టాక్స్ రిటర్న్స్‌ను సమీక్షించడం, ఆడిట్ కండక్ట్ చేయడం వంటివి ఓటవర్ టైమ్‌ పని విధానానికి దారితీస్తుంటాయి. ఈ ప్రొఫెషన్‌లో ఉన్నవారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ముఖ్యంగా టాక్స్ సీజన్స్‌లో స్ట్రెస్ పెరుగుతుంది. ఇది వివాహ బంధంపై ప్రతికూల ప్రభావితం చూపుతంది. డివోర్స్‌కు దారితీస్తుంది.

ఎగ్జాటిక్ డ్యాన్సర్స్

ఎగ్జాటిక్ డ్యాన్సర్ (Exotic Dancer) (అన్యదేశ నృత్యకారిణి) వృత్తిరీత్యా తరచూ ఆందోళనలో ఉంటారు. వివాహం చేసుకున్నప్పటికీ కుటుంబంతో సంతోషంగా గడపలేరు. టెన్షన్, అభద్రత, అసూయ వంటివి వీరిని వెంటాడుతుంటాయి. పరస్పర గౌరవం, స్పష్టమైన అవగాహన లేని భాగస్వామ్యాలవల్ల వీరు విడాకులు పొందే అవకాశం ఎక్కువ.

నాన్‌ఫామింగ్ యానిమల్ కేర్ టేకర్స్

వ్యవసాయేతర జంత సంరక్షకులు కూడా తమ వృత్తిరీత్యా ఒత్తిడిని ఎదుర్కొ్ంటారు. తరచుగా జంతువులపట్ల కరుణ, దయ వంటివి వీరిలో భావోద్వేగాలకు, అతి భావోద్వేగాలకు కారణం అవుతుంటాయి. జంతువులు బాధలో ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. ఈ పనిరీత్యా కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించరు. ఈ వృత్తిలో ఉన్న వ్యక్తి ఒత్తిడి, పనివిధానం భాగస్వామితో విడాకులకు దారితీయవచ్చు.

ఎలక్ట్రీషియన్లు

డైలీ ఎదురయ్యే ఎలక్ట్రికల్ ఇష్యూస్ కారణంగా ఎలక్ట్రీషియన్లు చాలా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మన దేశంలో తక్కువ కానీ విదేశాల్లో వీరు నిరంతరం ఫీల్డులో ఉండాల్సి వస్తుంది. సాయంత్రాలు, రాత్రిళ్లు, వారాంతాల్లో కూడా కుటుంబంతో గడిపే అవకాశం తక్కువ. పనిగంటలు ఆన్ డిమాండెడ్‌గా పెరుగుతుంటాయి. ఇది వివాహ బంధంలో డిస్ కనెక్ట్‌కు అంటే విడాకులకు దారితీస్తుంది.

గేమింగ్ సర్వీసెస్ వర్కర్స్

వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, ఫ్లోయింగ్ ఆల్కహాల్ అండ్ రిస్క్‌ను ప్రోత్సహించే వాతావరణంతో వీరు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అది వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది.

నర్సులు, అనెస్థీషియన్లు

నర్సింగ్ వృత్తి, అలాగే అనెస్థీషియనిస్టు వృత్తి ఈ రెండు టోటల్లీ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్రొఫెషన్స్‌గా ఉంటాయి. సాలరీస్ ఉన్నప్పటికీ అంతకు మించిన స్ట్రెస్ ఉంటుంది. అనెస్థీషియన్లు సర్జరీల సందర్భంగా రోగులకు మత్తు ఇవ్వడం, పర్యవేక్షించడం, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి ఇబ్బందులు కలిగి ఉంటారు. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు. నర్సులు కూడా తమ వృత్తికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం సహజంగానే ఏర్పడుతుంది. ఈ కారణాల రీత్యా తమ వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా కేంద్రీకరించరు. ఫలితంగా విడాకులకు దారితీస్తుంది.

డ్యాన్సర్స్ అండ్ కొరియో గ్రాఫర్స్

డ్యాన్సర్స్ అండ్ కొరియో గ్రాఫర్స్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. అయితే వీరు వృత్తిరీత్యా మానసిక, శారీరక అలసటకు గురవుతుంటారు. అలాగే ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది ఎక్కువ ఒత్తిడితో కూడినది కాబట్టి పర్సనల్ లైఫ్‌పై ప్రభావం పడుతుంది. డివోర్స్ వైపు మొగ్గుతారు.

మెకానిక్స్

ఏ రంగంలో ఉన్నా సరే మెకానిక్స్ ఎక్కవ గంటల పనిచేయడం, వారాంతాల్లో కూడా రెస్టు లేకపోవడం, తరచుగా అలసిపోయే పనివిధానం ఈ వృత్తిలో ఉంటుంది. ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేసే మూడ్‌లో కంటే అలసటలోనే ఎక్కువగా ఉంటారు. ఇది పర్సనల్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది. క్రమంగా విడాలకు దారితీయవచ్చు.

స్టాక్ అండ్ మెటీరియల్ మూవర్స్

స్టాక్ అండ్ మెటీరియల్ మూవర్స్ సాధారణంగా ఒక షిఫ్ట్‌లో 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. రాత్రిపూట కూడా పని చేయాల్సి రావడంవల్ల నిద్రలేమి, ఇతర అనారోగ్యాలు వస్తుంటాయి. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ వారి వైవాహిక బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

టెలిమార్కెటర్లు

చాలా మంది టెలిమార్కెటర్లు తమ టార్గెట్ పూర్తి చేయలేక తరచుగా టెన్షన్ పడుతుంటారు. స్ట్రెస్‌లో ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేరు. కస్టమర్లతో మాట్లాడుతూ రోజంతా గడపడంవల్ల ఇంటికి వచ్చేసరికి తీవ్రమైన అలసటలో ఉంటారు. ఇది వివాహ జీవితంలో అనేక సమస్యలకు దోహదం చేస్తుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్లు

ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఎక్కువ సమయం డిఫికల్ట్ పర్సనాలిటీస్ కలిగి ఉన్న వ్యక్తులను మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారి పనిని డాక్యుమెంట్ చేయడానికి, మూల్యాంకనం చేయడానికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. తరచుగా ఓవర్ టైమ్ పనిచేయాల్సి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సంస్థల్లోని ప్రొబేషనరీ ఆఫీసర్లు ఎక్కువగా భాగస్వామికి దూరంగా ఉంటారు. ఈ పరిస్థితి విడాకులకు దారితీస్తుంది.

టెక్స్‌టైల్ పరిశ్రమ ఉద్యోగులు

నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలోని ఉద్యోగుల్లో విడాకుల రేటు ఎక్కువగా ఉంటోంది. వీరి పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణం. స్పష్టమైన కారణాలు లేనప్పటికీ ఈ రంగంలో ఉన్నవారు లాక్ ఆఫ్ కెరీర్ లేదా ఫుల్‌ఫిల్ మెంట్ అలసటకు గురవుతుంటారు. పర్సనల్ లైఫ్ పట్ల ఆసక్తి కోల్పోతుంటారు. ఈ పరిస్థితి విడాకులకు దారితీస్తుంది.

లైబ్రరీ అసిస్టెంట్స్

ఈ వృత్తిలో ఉన్నవారు విడాకుల వైపు మొగ్గుతారంటే ఆశ్చర్యం అనిపించవ్చు కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఆ పరిస్థితి ఉంది. లైబ్రరీ అసిస్టెంట్లలో సగానికి పైగా పార్ట్ టైమ్‌గా మాత్రమే పనిచేస్తుంటారు. తక్కువ జీతం ఉండటం, ఫైనాన్షియల్ టెన్షన్స్ పెరిగిపోవడం, పని ఒత్తిడి వంటి కారణాలు మానసికంగా, శారీరకంగా కృంగదీస్తాయి. దీంతో వీరిలోనూ విడాకుల రేటు పెరుగుతోంది. వీరితోపాటు ప్రయోగశాలల్లో కెమికల్ టెన్నీషియన్స్, ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణులు, సైనిక సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మేనేజర్లు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. వృత్తి రీత్యా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడంవల్ల వీరిలో విడాకులు శాతం పెరుగుతోంది.

Next Story