- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీహెచ్ఎంసీ బడ్జెట్ ఫైనల్.. ఈసారి భిన్నంగా ప్రతిపాదనలు
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బడ్జెట్ ఫైనల్ అయింది. అన్ని విభాగాల అధికారులతో చర్చించి బడ్జెట్‌ను రూపొందించారు. గతం కంటే ఈసారి భిన్నంగా హెడ్ ఆఫీసు స్థాయిలోనే కాకుండా జోనల్, సర్కిల్ స్థాయిలోనూ బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగారు. ఈ నేపథ్యంలో కొన్ని విభాగాలు ప్రతిపాదనలు పంపించడంలో ఆలస్యం చేశాయని సమాచారం. మొత్తం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ రూ.8,340 కోట్లుగా నిర్ణయించారు.
2024-25లో బల్దియా బడ్జెట్ రూ.7,937 కోట్లకు అదనంగా రూ.403 కోట్లు చేర్చి 2025-26 బడ్జెట్ రూ.8,340 కోట్లుగా రూపొందించారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయం రూ.4,205 కోట్లుగా నిర్ణయించారు. రెవెన్యూ ఖర్చు రూ.3,936 కోట్లు, క్యాపిటల్ రిసిప్ట్స్ రూ.4,135 కోట్లు, క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ రూ.4,404 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఆస్తిపన్ను ద్వారా రూ.2500 కోట్లు, టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.1,037 కోట్లు, మ్యుటేషన్ ద్వారా రూ.105 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు హౌసింగ్ కోసం రూ.300 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.
నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం..
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి బాధ్యతలు చేపట్టాక ఇది రెండో స్టాండింగ్ కమిటీ సమావేశం. అయితే శనివారం బడ్జెట్ కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రూ.8,340కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.