- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబటి రాయుడు ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్!.. చేసింది వాళ్లే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటిరాయుడు కుటుంబానికి చంపుతామని బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన స్నేహితుడు సామ్ పాల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఏ ఆటలో అయినా గెలుపు ఓటములు సహజం. అలాగే ఐపీఎల్ లో కూడా కొన్ని సార్లు గెలిచినా.. మరికొన్ని సార్లు పరాజయం పాలు గాక తప్పదు. ఈ నేపధ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టీం ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. కోహ్లీని విమర్శిస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ అంబటిరాయుడు కోహ్లీపై విమర్శలు చేసినందుకు గానూ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి అంబటిరాయుడు కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై రాయుడు సామ్ పాల్ స్పందిస్తూ.. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్నట్టు కాదని రాయుడు చేసిన విమర్శలను జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్.. అతని భార్యను, ఇద్దరు చిన్న పిల్లలను లైంగిక దాడి చేయడంతో పాటు చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలిపాడు. అలాగే కొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయి రాయుడు కుటుంబంపై దాడికి యత్నిస్తున్నారని, అతని భార్య, కూతుళ్లను లక్ష్యంగా చేసుకొని చంపేస్తామని అంటున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు.