World Cup 2023 : ఆ ఐదు జట్లే.. వన్డే వరల్డ్ కప్ సెమీస్ కు చేరుతాయి : దాదా ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2023-07-10 05:10:19.0  )
World Cup 2023 : ఆ ఐదు జట్లే.. వన్డే వరల్డ్ కప్ సెమీస్ కు చేరుతాయి : దాదా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఈవెంట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో మొత్తం 48 మ్యాచ్ లు జరగనుండగా, మొత్తం 46 రోజల పాటు సమరం కొనసాగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టోర్నీపై తన అంచనాలను వెల్లడించాడు. సెమీ ఫైనల్స్‌కు ఏ జట్లు చేరుతాయో వెల్లడించాడు.

ఈ మెగా ఈవెంట్ లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‍కు చేరతాయని దాదా అంచనా వేశాడు. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టును ఏమాత్రం అంచనా వేయలేమని పేర్కొన్నాడు. అదేవిధంగా పాకిస్థాన్ సెమీస్‌కు వస్తుందని తాను ఆశిస్తున్నాని తెలిపాడు. ఇది జరిగితే సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా-పాక్ జట్లు తలపడితే తాను చూడాలనుకుంటున్నట్లు మీడియాకు తెలిపాడు. స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‍లో భారత ఆటగాళ్లపై ప్రెషర్ ఎప్పుడూ ఉంటుందని, దాన్ని అధిగమిస్తేనే అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధిస్తారని తెలిపాడు.

Advertisement

Next Story