- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T20 Cricket: టీ20 క్రికెట్‌లో సంచలనం.. చరిత్రలో ఇదే తొలిసారి
దిశ, వెబ్‌డెస్క్: సంచలన రికార్డులకు కేరాఫ్ అయిన టీ20 ఫార్మాట్(T20 cricket)లో మరో అరుదైన రికార్డు క్రియేట్ అయ్యింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో భాగంగా మణిపూర్(Manipur), ఢిల్లీ(Delhi) మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఏకంగా 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ(Ayush Badoni) 11 మందితో బౌలింగ్ చేయించడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పటివరకు వికెట్ కీపర్‌గా ఉన్న బదోనీ ఒక ఓవర్‌కు ముందే వచ్చి ఫీల్డింగ్ చేశాడు.
వికెట్ కీపర్ ఫీల్డింగ్ చేస్తున్నాడని అంతా ఆశ్చర్యంగా చూస్తున్న క్రమంలో ఏకంగా బౌలింగ్ చేశారు. అంతేకాదు.. బదోనీ వికెట్ తీయడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తరపున ఆడే 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. గతంలో ఐపీఎల్‌లో డక్కర్ ఛార్జర్స్ టీమ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తొమ్మిది మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించాయి.