టీ-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. తేల్చేసిన ఎక్స్‌ప‌ర్ట్స్ ప్యానెల్..!

by Satheesh |   ( Updated:2024-05-28 13:10:45.0  )
టీ-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. తేల్చేసిన ఎక్స్‌ప‌ర్ట్స్ ప్యానెల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు నెలన్నర రోజుల పాటు క్రికెట్ ప్రియులకు వినోదం పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇటీవల ముగిసింది. ఫైనల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి కోల్‌కతా 2024 సీజన్ విజేతగా నిలిచింది. ఇక, ఐపీఎల్ సందడి ముగియడయంతో క్రికెట్ ఫ్యాన్స్ జూన్‌లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జరగనున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌కు ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా అతిథ్యం ఇస్తో్న్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో టీ-20 వరల్డ్ కప్ సంగ్రామం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి ఏ జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి..? ఏ జట్టు పొట్టి ప్రపంచ కప్ విశ్వవిజేతగా నిలుస్తుంది..? అనే చర్చలు క్రీడా వర్గాల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ సారి వర్డల్ కప్ సెమీస్‌కు చేరే జట్లు ఏవే స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్ అంచనా వేసింది.

టామ్ మూడీ, సునీల్ గవాస్కర్‌, మాథ్యూ హేడెన్‌, ఆరోన్ ఫించ్‌, పాల్ కాలింగ్‌వుడ్‌, బ్రియ‌న్ లారా, శ్రీశాంత్, అంబ‌టి రాయుడు, క్రిస్ మోరిస్‌, మ‌హ్మద్ కైఫ్‌లు సెమీస్ చేరే టీమ్స్ ఏవో అభిప్రాయాలను వెల్లడించారు. భారత్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్లుకు ఈ సారి సెమీస్ చేరే అవకాశాలు మిగితా జట్లతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ ప్యానెల్‌లోని ప్రతి మెంబర్ ఇండియా సెమీస్‌కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గత టీ20 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ ఈ సారి సెమీస్ రేసులో ఉండదని ఈ ప్యానెల్ అంచనా వేయడం గమనార్హం. ఇక, ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్ 5వ తేదీన ఆడనుంది. ఆ త‌ర్వాత 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో న్యూయార్క్‌లో భారత్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యా్చ్ కోసం కేవలం భారత్, పాక్ అభిమానులే కాక క్రికెట్‌ను ఆదరించే అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

Next Story

Most Viewed