ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ

by Harish |
ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22 నుంచి టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆయా జట్లు ఇప్పటికే సన్నద్ధత మొదలుపెట్టాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్రీ ఐపీఎల్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. తాజాగా సీఎస్కే కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ట్రైనింగ్ క్యాంప్‌లో చేరాడు. ఎక్స్‌ వేదికగా ఫ్రాంచైజీ ధోనీ ఫొటోను పోస్టు చేసింది. ‘వింటేజ్ హెయిర్, క్లాసిక్ ఎమోషన్.. మహీ వచ్చేశాడు.’ అని రాసుకొచ్చింది. ఈ నెల 5న చెన్నయ్‌కు చేరుకున్న ధోనీ గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ధోనీ కొత్త లుక్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నయ్ తలపడనుంది.

Advertisement

Next Story