IND vs SL : బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తొలి ప్రాక్టీస్ సెషన్‌లోనే ఆ ఆటగాళ్లకు సూచనలు

by Harish |   ( Updated:2024-07-24 13:03:29.0  )
IND vs SL : బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తొలి ప్రాక్టీస్ సెషన్‌లోనే ఆ ఆటగాళ్లకు సూచనలు
X

దిశ, స్పోర్ట్స్ : పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు శ్రీలంకకు చేరుకున్నారు. సోమవారం ముంబై నుంచి బయల్దేరిన ప్లేయర్లు కొలంబో మీదుగా పెల్లెకెల్‌కు రీచ్ అయ్యారు. మంగళవారం కొత్త హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టినట్టు పేర్కొంది. మైదానంలో సంజూ శాంసన్, శివమ్ దూబెలకు గంభీర్ పలు సూచనలు చేశాడు. అలాగే, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ జట్టు సభ్యులతో చర్చలు జరిపాడు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సహా మిగతా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ పర్యటనలో ముందుగా టీమ్ ఇండియా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా శ్రీలంకకు చేరుకోలేదు. వన్డే సిరీస్‌కు ముందు వారు జట్టులో చేరనున్నారు.

Advertisement

Next Story