Border–Gavaskar Trophy: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్

by Gantepaka Srikanth |
Border–Gavaskar Trophy: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా(Team India) బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా ఆరుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో భారత్ 150 పరుగులకే ఆలౌటైంది. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి(41), రిషబ్ పంత్(37) రాణించడంతో ఈమాత్రం స్కోరు చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్(0), కేఎల్ రాహుల్(26), దేవదత్ ఫడిక్కల్(0), విరాట్ కోహ్లీ(5), ద్రువ్ జురేల్(11), వాషింగ్టన్ సుందర్(04), హర్షిత్ రాణా(07), బూమ్రా(8), సిరాజ్(0) పరుగులు మాత్రమే చేసి ఆసీస్ పేస్‌కు వికెట్లు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, కమ్మిన్స్ రెండు వికెట్లు, మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు.

Advertisement

Next Story

Most Viewed