- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gautam Gambhir :గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఖరారు?.. వచ్చేది వాళ్లే?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకమైన విషయం తెలిసిందే. అతని సపోర్టింగ్ స్టాఫ్ ఎంపికపై ఇంకా సందిగ్ధం నెలకొంది. అయితే, గంభీర్ సహాయ కోచ్‌లు ఖరారైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ద్రవిడ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న టి. దిలీప్‌ను కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. అలాగే, భారత మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ ర్యాన్ టెన్ డోస్చాట్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఖరారైనట్టు సమాచారం. వీరిద్దరు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున గంభీర్‌తో కలిసి పని చేశారు.
దిలీప్, అభిషేక్ శ్రీలంక పర్యటనకు గంభీర్‌తో వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ర్యాన్ టెన్ డోస్చాట్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగమవడంతో అతను ఎప్పుడు జట్టుతో కలుస్తాడన్న దానిపై సందిగ్దం నెలకొంది. మరోవైపు, బౌలింగ్ కోచ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నె మోర్కీల్‌ను బోర్డు గట్టి పోటీదారుడిగా భావిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్ తరపున గంభీర్, మోర్నె మోర్కీల్ రెండేళ్లపాటు వర్క్ చేశారు. అతనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 22న భారత ఆటగాళ్లు ముంబై నుంచి కొలంబోకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెల 27న భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.