చాంపియన్స్ ట్రోఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రాజీవ్ శుక్లా

by Harish |
చాంపియన్స్ ట్రోఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రాజీవ్ శుక్లా
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ‌లో భారత జట్టు పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. పాక్‌కు భారత జట్టును పంపించబోమని ఐసీసీకి బీసీసీఐ తెలిపినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తలను తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. చాంపియన్స్ ట్రోఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ‘అలాంటి సమాచారాన్ని ఎవరు అందించారో మాకు తెలియదు. బీసీసీఐ మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.’ అని చెప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రాజీవ్ శుక్లా గతంలోనే చెప్పారు.

కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. 2008 తర్వాత భారత జట్టు పాక్‌లో అడుగుపెట్టలేదు. గతేడాది ఆసియా కప్ కోసం పాక్‌కు వెళ్లేందుకు టీమ్ ఇండియా నిరాకరించగా.. ఆ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. చాంపియన్స్ ట్రోఫీని కూడా అదే తరహాలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed