- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. టీ20 సిరీస్ శ్రీలంక కైవసం
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ గడ్డపై శ్రీలంక జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో టీ20లో నెగ్గి 2-1తో సిరీస్ దక్కించుకుంది. సిల్హెట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను శ్రీలంక ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 174 పరుగులు చేసింది. కుసాల్ మెండిస్(86) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, రషీద్ హుస్సేన్ రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 146 పరుగులకే ఆలౌటైంది. నువాన్ తుషార ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. నాలుగో ఓవర్‌లో శాంటో(1), తౌహిద్ హృదయ్(0), మహముదుల్లా(0)లను వరుసగా అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. 32 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. రషీద్ హుస్సేన్(53) హాఫ్ సెంచరీతో రాణించగా.. తస్కిన్ అహ్మద్(31) విలువైన పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ 146 పరుగులైనా చేయగలిగింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 13న తొలి వన్డే జరగనుంది.