- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వింబుల్డన్‌లో ఆడటం లేదు- దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ వేదికగా జరగబోయే వింబుల్డన్ మెగా గ్రాండ్ స్లమ్ టోర్నీలో పాల్గొనడం లేదని స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ ప్రకటించాడు. జూలై 1 నుంచి ఆరంభమయ్యే టోర్నీకి తాను దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. అయితే, ఫిట్‌నెస్ సమస్య వల్లే రఫా వింబుల్డన్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది. కాగా, జూలై 26 నుంచి జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా, ఫిట్‌నెస్ లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే నాదల్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే రఫెల్ నాదాల్ తన టెన్నిస్ కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను అందుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో రఫా బరిలోకి దిగుతుండగా.. డబుల్స్‌లో రఫాకు జోడిగా కార్లోస్ అల్కరాస్ ఆడనున్నాడు. కాగా, ఈసారి వింబుల్డన్ ప్రైజ్ మనీని 50 మిలియన్ పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.533 కోట్ల)కు పెంచారు.