డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్?.. క్లారిటీ ఇచ్చిన సౌతాఫ్రికా బ్యాటర్

by Harish |
డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్?.. క్లారిటీ ఇచ్చిన సౌతాఫ్రికా బ్యాటర్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20లకు తాను రిటైర్మెంట్ ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ‘మీడియా క‌థ‌నాల్లో వ‌స్తున్నట్టుగా నేను అంత‌ర్జాతీయ‌ టీ20ల‌కు వీడ్కోలు ప‌లుక‌లేదు. ప్రొటిస్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడేందుకు అందుబాటులోనే ఉన్నాను. నా అత్యుత్తమ ఆట ఇంకా రావాల్సి ఉంది’ అని పోస్టు చేశాడు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో సౌతాఫ్రికా.. భారత్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. క్లాసెన్(52) క్రీజులో ఉన్నంత సేపు ఆ జట్టుదే విజయం అనిపించగా.. పాండ్యా అతన్ని అవుట్ చేసి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన మిల్లర్(21) బౌండరీ వద్ద సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగడంతో భారత్ విజయం ఖరారైంది. ఆ క్యాచ్ చేజారినా.. సిక్స్ వెళ్లినా ఫలితం మరోలా ఉండేదేమో. సోమవారం మిల్లర్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టడంతో అతను టీ20లకు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలకు మిల్లర్ ఫుల్‌స్టాఫ్ పెట్టాడు.

Next Story

Most Viewed