TGPSC వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన.. KTR షాకింగ్ కామెంట్స్

by Anjali |
TGPSC వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన.. KTR షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు నగరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. టీజీపీఎస్సీ వద్ద రోడ్డు మీద పోయేవాళ్ళని సైతం అరెస్టు చేస్తున్నారు. మేము ధర్నా కోసం రాలేదు రోడ్డు మీద వెళ్తున్నామని చెప్తున్న వినకుండా.. ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను మెట్రో కూడా ఎక్కనివ్వడం లేదు. విద్యార్థుల ప్రతి ఒక్కరి వాట్సాప్ చెక్ చేశాకనే మెట్రోలోకి అనుమతిస్తున్నారు. అయితే తాజాగా విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల శాంతియుత నిరసన పైన ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను నిరుద్యోగులను యువకులను భేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed