- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైని ముంచెత్తిన వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు
దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరపిలేని వాన కురిసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. థానేలో నీట మునిగి రిసార్ట్ నుంచి 49 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పాల్ఘర్ లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్థులు రక్షించారు.
సబర్బన్ సర్వీసులపై వర్షం ప్రభావం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులపై ప్రభావం పడింది. సోమవారం ఉదయం స్టేషన్లు, ట్రాక్‌లపై నీరు నిలిచిపోయింది. కొన్ని గంటపాటు రైళ్లు నిలిచిపోయాయి. డోంబివిలి స్టేషన్‌లో ట్రాక్ లపై నీరు చేరింది. అట్‌గావ్, థాన్‌సిత్ స్టేషన్‌ల మధ్య ట్రాక్‌లపై దెబ్బతిందని.. కసర,టిట్వాలా స్టేషన్ల మధ్య రైలు సేవలు నిలిపివేశారు. అత్యంత రద్దీగా ఉండే కల్యాణ్- కసర మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక రైళ్లను దారి మళ్లించారు. కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఇకపోతే, ముంబైలో సోమవారం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు-నాలుగు రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.