- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తండ్రీ కూతుళ్ళ పై అత్యంత నీచాతి నీచంగా వ్యాఖ్యలు.. నటుడిపై కేసు
దిశ, సినిమా: ఇటీవల సుధీర్ బాబు నటించిన మూవీ ‘హరోం హర’. ఈ సినిమాలో నటించిన సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ సీన్లలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఏం లాభం రియాలిటీలో జీరో అనిపించుకున్నాడు. అయితే ఇతను యాక్టర్‌గా కంటే కంటెంట్ క్రియేటర్‌గానే నెటిజన్లలో ఎక్కువగా గుర్తింపు పొందాడు. తెలుగు సినిమాలను తిట్టటమే పనిగా పెట్టుకుంటూ టాలీవుడ్లో ఫోజులు కొడుతున్నావంటూ నెటిజన్లు అతనిపై విమర్శలు సైతం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం అతనిపై విమర్శలు చేసి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా పేదోడు జోక్స్, ఇన్‌సెప్ట్ హాస్యం పేరుతో తండ్రి కూతుళ్ళ సంబంధంపై ప్రణీత్ హనుమంత్ మరో ఇద్దరితో కలిసి అసభ్య కామెంట్లు చేస్తున్నారు.
ఒక తండ్రి తన కూతురితో సరదాగా వీడియో చేయగా.. దీనిపై కొంతమంది యూట్యూబర్ డార్క్ కామెడీ పేరుతో విచ్చల విడిగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇంతలో, ప్రణీత్ అభ్యంతరకరమైన భాగాలను తీసేసి ఓ పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్‌లో భాగంగా.. వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించాను. దీనిపై క్షమాపణలు చెబుతున్నాను.. కంటెంట్ క్రియేటర్‌గా నా ప్రయత్నం అందరిని సంతోషంగా ఉంచడమే. కానీ ఈ సారి గీత దాటాను. అని క్షమాపణలు కోరుతూ ప్రణీత్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.