- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srinu Vaitla: అందుకే గ్యాప్ తీసుకున్నా అంటూ అసలు విషయం బయటపెట్టిన శ్రీను వైట్ల
దిశ , వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కథ ఎలా ఉన్నా దానిని ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం ఈయన స్టైల్. అందుకే, ఆయన మూవీస్ కి ఆడియెన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన వెంకీ, దుబాయ్ శీను, ఢీ, కింగ్, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి సినిమాలు ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి.
ఆరేళ్ళు విరామం తీసుకుని "విశ్వం" అనే మూవీతో మన ముందుకొచ్చాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇక, ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల.. తానూ ఇన్నేళ్లు ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నారు? గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటనేది వెల్లడించాడు.
" ఈ మధ్య ఆడియెన్స్ కొత్త కథల వైపే మొగ్గు చూపుతున్నారు. నా మూవీ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాకపోతే, కథలను రిపీట్ అవుతున్నాయని వారు ఫీలవుతున్నారు. అందుకే ఇంత కాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సరికొత్త థీమ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. అందుకే టైమ్ తీసుకుని ‘విశ్వం’ మూవీని తెరకెక్కించా. ఈ మూవీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోందని" అని చెప్పుకొచ్చాడు.