బస్తర్ ఎన్కౌంటర్లో మరణించింది వీళ్లే.. రివార్డు ఎంతంటే..

by Y.Nagarani |
బస్తర్ ఎన్కౌంటర్లో మరణించింది వీళ్లే.. రివార్డు ఎంతంటే..
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్ గఢ్ లోని నెందూర్ - థుల్ థులి గ్రామాల మధ్యనున్న బస్తర్ అడవుల్లో (Baster Forest) శుక్రవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 31 మంది మావోలు మరణించినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని, వారిలో 16 మంది గుర్తించామని తెలిపారు. మరో 15 మందిని గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. వీరిపై మొత్తం రూ.1.3 కోట్ల రివార్డ్ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినవారుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఇంద్రావతి ఏరియా కమిటీ పీజీఎల్ఏ 6వ బెటాలియన్ సభ్యులని తెలిపారు. గుర్తించిన వారిలో డీకేఎస్ఈ సభ్యురాలు ఊర్మిళ, డివిజన్ కమిటీ సభ్యులు మడకం మీనా, సురేష్ లు ఉన్నారు. ఒక్క ఊర్మిళపైనే రూ.20 లక్షల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఎవరూ లేరని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. మృతదేహాలను దంతెవాడ(Dantewada)కు తరలించినట్లు వెల్లడించారు. మావోయిస్టులకు కొట్టిన పిండిగా చెప్పుకునే బస్తర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్.. మావోయిస్టుల చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్ (bastar encounter) అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story