తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు

by Y. Venkata Narasimha Reddy |
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బహిర్గతమైంది. ఈ-మెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు, సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు తిరుపతి రేణిగుంటఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపుల వ్యహహారాన్ని సీరియస్ గా తీసుకున్న దర్యాప్తు బృందాలు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement

Next Story

Most Viewed