ఆ స్టార్ హీరోయిన్ భర్తతో త్రిప్తి డిమ్రి ఫొటో వైరల్.. విడాకులు ఫిక్స్ అంటున్న నెటిజన్లు

by Hamsa |
ఆ స్టార్ హీరోయిన్ భర్తతో త్రిప్తి డిమ్రి ఫొటో వైరల్.. విడాకులు ఫిక్స్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ గత ఏడాది రణ్‌బీర్ కపూర్‌తో నటించిన ‘యానిమల్’ మూవీతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆ అమ్మడు నటనకు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. అయితే త్రిప్తి యానిమల్ సినిమా తర్వాత నుంచి ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన వార్తలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

అలాగే త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వరుస పోస్టులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస సినిమాలు కూడా చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ప్రస్తుతం త్రిప్తి బ్యాడ్ న్యూజ్ అనే మూవీ చేస్తుంది. ఇప్పటకే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ చిత్రం జూలై 19న థియేటర్స్‌లో విడుదలవుతోంది.

ఈ క్రమంలో.. తాజాగా, త్రిప్తి డిమ్రి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భర్త వీక్కీ కౌశల్‌తో స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్ చేస్తున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది. జూలై 9న బ్యాడ్ న్యూజ్ నుంచి జానం సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం త్రిప్తి షేర్ చేసిన ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ నెటిజన్లు కొందరు కత్రినా కోపంగా ఉన్న మీమ్స్ షేర్ చేస్తూ విడాకులు ఇస్తుంది, లేదా సల్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు రణబీర్ త్రిప్తిని అలా చూస్తే తట్టుకోలేడు అని అంటున్నారు. త్రిప్తి పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కొందరు మరీ దారుణంగా కామెంట్లు పెడుతూ త్రిప్తి, విక్కీ ఫొటోను వైరల్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు ఫ్యాన్స్ మాత్రం అదంతా సినిమా కోసమే అని అంటున్నారు.

Advertisement

Next Story