ఆరో తోడేలు హతం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-06 05:04:20.0  )
ఆరో తోడేలు  హతం
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లా వాసులను హడలెత్తిస్తున్న మాన్ ఈటర్ తోడేళ్ళలో ఆరో తోడేలును ఎట్టకేలకు గ్రామస్థులు మట్టుపెట్టారు. దీంతో తోడేళ్ళ బాధిత గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని తమాచిపుర్ గ్రామంలో ఆరో తోడేలు గ్రామస్తుల చేతికి చిక్కి హతమైంది. అటవీశాఖాధికారులు దాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దీంతో ఆపరేషన్ భేడియా పూర్తయినట్లుగా అటవీ అధికారులు తెలిపారు. తోడేళ్ళ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా దాడులు చేస్తున్న తోడేళ్ళు చిన్నపిల్లలే టార్గెట్‌గా దాడి చేశాయి. వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. కనిపిస్తే కాల్చి చంపేయమని సీఎం యోగి గర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. తోడేళ్ళ వలన కొన్ని గ్రామాలకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. ముందుగా నరమాంస భక్షక తోడేళ్ళ గుంపులో ఐదింటిని పట్టుకోగా, ఆరో తోడేలు గ్రామస్తుల చేతిలో హతమైంది.

Advertisement

Next Story

Most Viewed