Secunderabad-Goa Train: సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లే రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-06 12:00:21.0  )
Secunderabad-Goa Train: సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లే రైలును  ప్రారంభించిన కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్:తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా(Secunderabad-Vascodigama) రైలును(17039/17040) కేంద్ర మంత్రి(Union Minister) కిషన్ రెడ్డి(Kishan Reddy) ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి..ప్రతి గురు,శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది.ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు 20 గంటల్లో చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) వెల్లడించింది.సికింద్రాబాద్ నుంచి ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు 7 గంటల 20 నిమిషాలకు వాస్కోడిగామాకు చేరుకుంటుంది.ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, షాదర్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్ , కర్నూల్‌ సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్‌పేట్‌, కొప్పల్‌, గదడ్‌, హుబ్బలి, దర్వాడ్‌, లోండా, మడ్గావ్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఇక ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌కు రూ.440, థర్డ్‌ ఎకానమీకి రూ.రూ.1100, ఏసీ త్రీటైర్‌కి రూ.1185, సెకండ్‌ ఏసీకి రూ.1700, ఫస్ట్‌ ఏసీకి రూ.2860గా దక్షిణ మధ్య రైల్వే టికెట్‌ ధరలను నిర్ణయించింది.కాగా ప్రతి సంవత్సరం మన దేశం నుంచి దాదాపు 80 లక్షల మంది గోవా పర్యటనకు వెళ్తుండగా.. అందులో 20 శాతం మంది తెలుగు ప్రజలే ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed