- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్యకాపరమేశ్వరికి రూ.6,66,66,666.66తో అలంకరణ
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం పాలమూరు జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు అమ్మవారికి 6 కోట్ల 66 లక్షల 66 వేల 6 వందల 66 రూపాయల 66 పైసలతో అలంకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో భాగంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని అలంకరించే కమిటీ సభ్యులు.. ఈసారి 6 అంకెను ఎంచుకొని తమిళనాడు నుండి ప్రత్యేకంగా పిలిపించిన నిపుణులతో అమ్మవారికి కరెన్సీ అలంకరణ చేయించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, కార్యదర్శి మిర్యాల వేణుగోపాల్, కోశాధికారి తల్లం నాగరాజు, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.