Mercury Transit : బుధుడి గోచారం ప్రభావం.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే

by Prasanna |
Mercury Transit : బుధుడి గోచారం ప్రభావం.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా చెబుతుంటారు. బుదుడి రాశి గోచార ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడుతుంది. అక్టోబర్ నెలలో బుధుడి గోచారం కారణంగా రెండు రాశులకు కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి

బుధుడి గోచారం మకర రాశి వారికీ అదృష్టం తీసుకురానుంది. ఈ నెల మొత్తం వీరికి అనుకూలంగా ఉంటుంది. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ ఇది మంచి సమయం. వ్యాపారాలు చేసే వారికీ లాభాలు పెరుగుతాయి. అక్టోబర్ 10 నుంచి 29 వరకూ ఈ రాశివారికి తిరుగే ఉండదు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.

తులా రాశి

తులా రాశి వారికీ ఈ నెల మొత్తం చాలా బాగుంటుంది. వీరికి ఊహించని సంపద వచ్చి పడుతుంది. అక్టోబర్ నెలలో ఈ రాశివారు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇది అనువైన సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed