- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lipstick: లిప్‌స్టిక్ లో వెజ్, నాన్ వెజ్ ఉన్నాయని తెలుసా.. రెడ్ షేడ్ వాడే వాళ్ళు వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, చాలా మంది అమ్మాయిలు అందంగా ఉండేందుకు రక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటిలో ముఖ్యమైనది లిప్‌స్టిక్. సమయం, సందర్భం లేకుండా ప్రతిరోజూ అదేపనిగా లిప్‌స్టిక్ వేసుకుంటూ ఉంటారు. అయితే, ఈ లిప్ స్టిక్ లో వెజ్, నాన్ వెజ్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతీ అమ్మాయి మేకప్ వేసుకునేందుకు ఇష్టపడతారు. ఫేస్ కలర్ ని బట్టి రక రకాల మేకప్‌లు వాడుతుంటారు. అమ్మాయి ముఖంలో పెదవులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఇంటర్ చదివే అమ్మాయి నుంచి ఆఫీసుకు వెళ్లే మహిళ వరకు ప్రతిరోజూ లిప్‌స్టిక్‌ను ( Lipstick) వేసుకుని వెళ్తారు.
అయితే, ఇదేలా తయారవుతుంది? దానిలో ఏం వాడతారు? లిప్‌స్టిక్ లో వెజ్, నాన్ వెజ్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే, రెడ్ లిప్ స్టిక్ మీద పరిశోధనలు చేసి నాన్ వెజ్ అని నిపుణులు తేల్చి చెప్పేశారు. అంతే కాకుండా, రెడ్ షేడ్ వాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. లేదంటే, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రెడ్ లిప్‌స్టిక్‌ల్లో (Red Lipstick) కీటకాలలో ఉండే ఎరుపు రంగు కార్మైన్ ను కలిగి ఉంటాయి. కాబట్టి , లిప్ స్టిక్ వాడే ముందు దాని గురించి సమాచారం తెలుసుకుని వాడటం మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.